Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ కొట్టారంటూ టీచర్లపై ఫిర్యాదు : విద్యార్థితో పాటు తల్లిదండ్రులపై పోక్సో కేసు!

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (11:01 IST)
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 9వ తరగతి చదువుతున్న బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. సహా విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి వారిని వేధిస్తున్న ఆరోపణలపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఐదుగురు అమ్మాయిల ఖాతాలను హ్యాక్ చేసిన బాలుడు వారి వ్యక్తిగత ఫోటోలు మెసేజ్‌లను ఇతర క్లాసుల అబ్బాయిల మొబైల్స్‌కుపంపి కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్కూల్‌ టీచర్లు నాలుగు రోజుల క్రితం బాలుడుని మందలించి కొట్టారు. దీంతో బాలుడు తండ్రి అసలు విషయం దాచి టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
విషయం తెలిసిన బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, బాలుడు వేధింపులపై విచారణ చేపట్టిన ప్రొద్దుటూరు ఎంఈవో సావిత్రమ్మ, రూరల్ సీఐ బాలమద్దిలేటి వేధింపులు నిజమేనని తేల్చారు. దీంతో బాలుడుతో పాటు అతడికి అండగా ఉన్న తల్లిదండ్రులు మూలే కొండమ్మ, మాధవరెడ్డి, కౌన్సిలర్‌ మురళీధర్ రెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments