Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి జీవోలు - ఏసీబీ తనిఖీలు ఆపండి : బొప్పరాజు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (15:18 IST)
ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా నడుచుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా, అర్థరాత్రి జీవోలు ఆపాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దారు కార్యాలయాల్లో గతేడాది జనవరి నుంచి పలు దఫాలుగా చేపడుతున్న తనిఖీలను తక్షణం నిలిపివేయాలని కోరారు. 
 
విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సాధారణ పరిపాలనను ఎప్పటికప్పుడు సమీక్షించి లోటుపాట్లు సవరించడానికి ఐదు అంచెల వ్యవస్థ ఉందన్నారు. 
 
వాటిని కాదని ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం వల్ల మానసిక స్థైర్యం దెబ్బతింటోందని  ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.  లంచం తీసుకుంటూ దొరికిన, అధిక ఆదాయం, ఆస్తుల కేసుల్లో పట్టుబడిన ఉద్యోగుల విషయంలో అసోసియేషన్‌ జోక్యం చేసుకోదని బొప్పరాజు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments