Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరు మాలలు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (18:15 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగ‌ళ‌వారం తిరుమలకు చేరుకున్నాయి.

ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అక్కడినుంచి టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. 
 
అంతకుముందు ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు.

గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య జాయింట్ క‌మిష‌న‌ర్ ధ‌న‌పాల్ ర‌విచంద్ర‌, ఈవో ఇలంగోవ‌న్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments