Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామంలో బట్టలు ఉతకబోమని దండోరా వేసిన రజకులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ వలంటీర్ల పోస్టుల నియామకం ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఓ వలంటీర్ చొప్పున నియమించనున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి 100 గృహాలకు ఒక వలంటీర్‌ను ఎంపిక చేయనున్నారు. 
 
అయితే, ఈ వలంటీర్ పోస్టుల ఎంపిక గ్రామంలో చిచ్చుపెట్టింది. దీంతో ఆ గ్రామానికి చెందిన రజకులు మాసిన బట్టలు ఉతకరాదని తీర్మానించారు. ఈ విషయాన్ని చాటింపు వేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీవాడ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామంలో గ్రామ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో తాము ఉంటున్న కాలనీలో తమ కులస్తుడికికాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామంలోని రజకులంతా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ కులస్తుడికికాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టు ఇచ్చినందుకు శనివారం నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాట గ్రామంలో దండోరా వేయించారు. దీనిపై గ్రామ పెద్దలు లేదా మండల అధికారులు నోరుమెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments