Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ సాహసం : వాగులో కొట్టుకునిపోతున్న వ్యక్తిని...

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:54 IST)
కడప జిల్లాలో ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలు ఫణంగా పెట్టిన సాహసం చేశారు. వరద నీటిలో కొట్టుకునిపోతున్న వాహనదారుడుని ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటన జిల్లాలోని రాయచోటి పట్టణ శివారు ప్రాంతంలో జరిగింది. 
 
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణ శివారుల్లోని ఇనాయత్ ఖాన్ చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రాజు ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఉండేందుకుగానూ అక్కడ పోలీసు సిబ్బందిని బందోబస్తుగా నియమించారు. 
 
ఈ నేపథ్యంలో ఒక వాహనదారుడు రాయచోట వద్ద స్కూటరుపై రోడ్డు దాటుతుండగా పట్టుకోల్పోయి కిందపడ్డాడు. దీన్ని గమనించిన కానిస్టేబుల్ నరేంద్ర వెంటనే అప్రమత్తమై స్థానికుల సాయంతో వాహనదారుడుని అలుగులో కొట్టుకుపోకుండా రక్షించాడు. దీంతో నరేంద్రను పోలీసులతో పాటు.. స్థానికులు కూడా అభినందించారు. జిల్లా ఎస్‌‌పీ కేకేఎన్ అన్బురాజన్ నరేంద్రను ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments