Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (10:08 IST)
విశాఖపట్టణం - హైదరాబాద్ నగరాల మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇరు మార్గాల్లో 20707/20708 నంబర్లతో నడిచే వందే భారత్ రైలు బోగీల సంఖ్యను పెంచుంతున్నట్టు తెలిపింది. సాధారణ రోజుల్లో ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అమితమైన డిమాండ్ ఉంది. దీనికితోడు సంక్రాంతి రద్దీ విపరీతంగా ఉంది. దీంతో ఈ రైలులోని అన్ని బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీని నియంత్రించడంతో పాటు సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారి కోసం ఈ రైలు బోగీల సంఖ్యను పెంచుతున్నట్టు ద.మ.రైల్వే వెల్లడించింది. 
 
ప్రస్తుతం 8 కోచ్‌లతో ఈ రైలు నడుస్తుండగా, సోమవారం నుంచి మరో 8 బోగీలను అనుసంధానిస్తున్నట్టు పేర్కొంది. దంతో మొత్తం కోచ్‍ల సంఖ్య 16కు పెరగనుంది. అలాగే, ప్రస్తుతం 530 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, రేపటి నుంచి 1128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 
 
కాగా, గత యేడాది మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ రైలుకు ఒక ఎగ్జిక్యూటివ్ కోచ్, ఏడు చైర్‌కార్ బోగీలు ఉన్నాయి. తాజాగా 8 బోగీలను జోడిస్తుండటంతో ఎగ్జిక్యూటి కోచ్‌ల సంఖ్య 2కు, చైర్‌కార్‌ బోగీల సంఖ్య 14కు పెరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments