Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులో వున్న డబ్బు తీసివ్వలేదని తల్లిదండ్రులను చితకబాదాడు

Webdunia
గురువారం, 14 మే 2020 (19:50 IST)
డబ్బు కోసం ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్న ఈ కాలంలో తల్లిదండ్రులకు కూడా ముప్పు తప్పడం లేదు. డబ్బు కోసం కన్న కొడుకు తల్లిదండ్రులను చితకబాదాడు. ప్రక్క వారికి ఉన్న కనికరం కూడా అతనికి లేకపోయింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన నక్కా రంగయ్య దంపతులు ఐదు లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. డబ్బు తెచ్చివ్వమని కొడుకు వారితో ఇప్పటికే చాలాసార్లు గొడవపడ్డాడు. ఇదేవిధంగా మరోమారు వేధించసాగాడు. ఆ వృద్ధులు దాని ఒప్పుకోకపోవడంతో పైశాచికంగా ప్రవర్తించాడు. 
 
కర్ర తీసుకుని చితకబాదాడు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఈ విషయం తెలియడంతో దారుణానికి దిగిన కొడుకుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments