Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (17:14 IST)
కర్నూలు జిల్లాలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకంగా జరిగింది. ఈ శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే మీకు చలనం లేదా అంటూ సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నించారు. 
 
అసాంఘిక శక్తులను పెంచి పోషించి రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం మీరు వహిస్తున్న మౌనం మత కల్లోలాలకు దారితీస్తుంటే మీకు కళ్లు కనిపించడం లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలం దేవాస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. 
 
ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో తానే స్వయంగా పర్యటిస్తానని ప్రజా క్షేత్రంలో మీ నిరంకుస వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments