నెల్లూరులో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుసూదన శాస్త్రికి నివాళి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:53 IST)
నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతి చెందారు. ఎంతో పేరొందిన డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి భౌతికకాయానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులర్పించారు. డాక్ట‌ర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
అంకిత భావంతో సేవలు అందించడం ద్వారా డాక్టర్ అంటే మధుసూదన శాస్త్రినే అనే ప్రత్యేక గుర్తింపు పొందార‌ని సోమిరెడ్డి పేర్కొన్నారు.న ఆయ‌న నెల్లూర న‌గ‌రానికే కాదు...చుట్టుప‌క్క‌ల ప‌లు గ్రామాల వారికి గొప్ప వైద్యుడ‌ని, అతి త‌క్కువ ఫీజుతో అంద‌రికీ ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి వైద్య వృత్తిపరమైన బాధ్యతల నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయుల‌ని, త‌మ‌ తండ్రి గారి నుంచి, త‌న వరకు ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉంద‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మధుసూదన శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. 

నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతికి న‌గ‌రంలోని ప‌లువురు సంతాపం తెలిపారు. భారీగా జ‌నం ఆయ‌న అంతిమ యాత్ర‌లో పాల్గొని నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

Mohan Babu: డా. ఎం. మోహన్ బాబు కి MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ గ్రాండ్ ఈవెంట్

Sudheer Babu:.నటుడిగా నేను విజయం సాధిస్తానా? ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా? నాకు భయంగా ఉంది: సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments