Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు జపాన్ దిగ్గజం ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:05 IST)
జపాన్ దిగ్గజ సంస్థ ‘సాఫ్ట్ బ్యాంక్’ ఏపీలో విద్యుత్ వాహన రంగంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ  శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో  సాఫ్ట్ బ్యాంక్   చర్చించింది.

సోమవారం హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో జరిగిన బిజినెస్ ఔట్ రీచ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి బృందం మంత్రిని కలుసుకుని చర్చలు జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఏ రంగంలో పెట్టుబడులకైనా ఏపీలో ఉన్న అనుకూల వాతావరణం గురించి మంత్రి మేకపాటి ప్రతినిధులకు వెల్లడించారు.

సంక్షేమం, పరిశ్రమల వృద్ధిని సమాన స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని మంత్రి వారికి తెలిపారు. కొత్త సంవత్సరం కల్లా పరిశ్రమలకు అనుకూలమైన పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని మంత్రి వివరించారు.

యువతకు ఉపాధి, మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలైన పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి ప్రతినిధులకు వివరించారు.

ఆ నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా.. గొప్ప నిర్ణయాలని వారు కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి ముందుకు సాగేందుకు ఆసక్తిగా ఉన్నామని మంత్రితో అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.

రెండు వారాల్లో స్పష్టమైన ప్రణాళికతో మరో సారి భేటీ అయి పూర్తి వివరాలు అందించాలని మంత్రి కోరారు. ఆ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ ప్రతిపాదనలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి తెలిపారు. అందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపారు. 
 
వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి వరుస సమావేశాలు..
బిజినెస్ ఔట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివిధ సంస్థలతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధుల బృందం మంత్రితో భేటీ అయ్యారు.

ఈటీఏ అలెక్ట్రా ఎలక్ట్రానిక్ వెహికిల్స్ సీఈవో బిజు థామస్, విష్ణు గ్రూప్ వైస్ ఛైర్మన్ రవి చంద్రన్ ,  డెలాయిట్ ప్రతినిధి కౌశల్, జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ , అహ్మదాబాద్ కు చెందిన ఐఐఎమ్ ప్రతినిధి, ఏపీ బ్రాండింగ్ ప్రమోషన్ పై పీఆర్ ఏజెన్సీలతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఐటీ, పరిశ్రమ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతికత అభివృద్ధి వంటి అంశాలపై మంత్రి ఆయా కంపెనీలతో చర్చించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments