Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో ట్రెండ్ మారింది.. గ్రామ పంచాయతీ ఎన్నికలు.. వాట్సాప్‌లో ప్రచారం

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:59 IST)
ఎన్నికలంటే పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులు, బంధువులతో ఇంటింటి ప్రచారంలోకి దిగుతారు. చేతిలో ఎన్నికల గుర్తులకు సంబంధించిన కరపత్రాలు, భుజాన జెండాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వాట్సాప్ ద్వారానే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక సమస్యలతో మేనిఫెస్టోలు తయారు చేసి గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే వందలాది వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అయినట్లు సమాచారం. 
 
కోనసీమలోని సఖిలేటిపల్లి, రాజోలు, మలికీపురం మండలాలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో కూడా వాట్సాప్ పబ్లిసిటీ నడుస్తోంది. అంబాజీపేట మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తాను 20 ఏళ్లుగా గ్రామానికి చేసిన సేవను వీడియో రూపంలో రిలీజ్ చేసి షేర్ చేస్తున్నారు. మరో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎమ్మెల్యే స్థాయిలో ప్రచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
సోషల్ మీడియా ప్రచారం మొదటి రెండు విడతల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. దీంతో మూడు, నాలుగో విడత ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను అభ్యర్థులు ఫాలో అయిపోతున్నారు.

ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి వాట్సాప్ ఓకే.. మరి లేని వారి పరిస్థితేంటని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. అందుకే బల్క్ మేసేజ్ లు పంపేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి.. గ్రూప్ ఎస్ఎమ్మెస్‌లు పంపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments