Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మందివున్నారు : సామాజిక కార్యకర్త దేవి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారంటూ మండిపడ్డారు.

Social Activist Devi
Webdunia
గురువారం, 18 జనవరి 2018 (14:01 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఇటీవలి కాలంలో వర్మ గాడ్, సెక్స్‌, ట్రూత్ పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాంశంగా చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వ‌ల్ల శృంగారంపై ఉన్న అపోహ‌లు చెరిగిపోతాయ‌నేలా వ‌ర్మ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై దేవి స్పందించారు. 
 
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'మ‌నిషి జంతువు కాదు.. జంతువు స్థాయి నుంచి దాటి వ‌చ్చాడు కాబ‌ట్టే కొన్ని గోప్య‌తలు అవ‌స‌రం అయ్యాయి. మ‌నుషుల స్థాయిలో ఉండ‌ద‌లుచుకోలేదంటూ, ఇలాగే చూపించ‌ద‌లుచుకున్నామంటూ ఇటువంటి సినిమాలు తీసి నాగ‌రిక స‌మాజంలో బ‌తుకుతోన్న వారిపై వ‌దులుతారా? మీ జంతు లోకంలోకి ఈ నాగ‌రిక స‌మాజం రావాల‌నుకోవ‌డం లేదు. 
 
ఇది భూతు కాద‌ని అంటున్నారు. ఇటువంటి సినిమాలు, వీడియోలు శారీర‌క ప్ర‌క్రియ‌లో క్రూర‌త్వాన్ని చూపుతాయి. పోర్నోగ్ర‌ఫీ ఎటువంటి దారుణాల‌కు దారి తీస్తుందో తెలుసుకుని మాట్లాడాలి. స‌మాజంలో సెక్స్‌పై ఉన్న చెడు భావాల‌ను, ఛాంద‌స్తాన్ని పోగొట్ట‌డానికే ఇటువంటి వీడియోలు, సినిమాలు అని అంటున్నారు. ఫోర్నోగ్ర‌ఫీయే ఒక పెద్ద ఛాద‌స్తం. ఆరోగ్య‌క‌ర‌మైన ఆలోచ‌న‌లు, శ‌రీరం క‌లిగిన వారికి కృతిమ‌మైన ప్రేర‌కాలు, ఇటువంటి భూతు సినిమాలు అవ‌స‌రం ఉండ‌వు. ప్ర‌పంచంలో ఇటువంటి (రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి) పిచ్చోళ్లు చాలా మంది ఉన్నారు' అంటూ దేవి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం