ఒకే కుటుంబంలో నలుగురికి పాముకాటు..ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (20:42 IST)
నలుగురు చిన్నారులు ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము కాటేసింది. అయితే ఆ విషయం పిల్లలు చెప్పకపోవడంతో దారుణం జరిగిపోయింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారులు పాముకాటుకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో పాలయ్యారు. ఈ ఘటన జిల్లాలోని గాలివీడు మండలం ఎగువమూల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వేణుగోపాల్ నాయుడు, ఈశ్వరమ్మలకు యువరాణి, శివకుమారి, బాలవర్ధన్‌నాయుడు, శేషాద్రి నాయుడు సంతానం.
 
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నలుగురు పిల్లలు పాముకాటుకు గురయ్యారు. తెల్లవారుజాము సమయంలో వేణుగోపాల్ ఇంట్లో లైట్ వేయడంతో గుమ్మం వద్ద కట్లపాము కనిపించడంతో చంపేశాడు. అయితే పాము కరిచిందని పిల్లలు ఎవరూ చెప్పకపోవడంతో పట్టించుకోలేదు. ఉదయం ఏడు గంటల సమయంలో కొడుకు శేషాద్రి నాయుడు గొంతునొప్పిగా ఉందని చెప్పడంతో నాటువైద్యం చేయించారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
 
వెంటనే మిగిలిన ముగ్గరినీ రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఒకరి శరీరంలో విషం ఎక్కువ మోతాదులో ఉండడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాముకాటుకు చిన్నారి బలి కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments