కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లు వున్నాయని చెప్తే.. 100 నిమిషాల్లో? శివాజీ

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:35 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో కోట్లు ఉన్నాయని ఒకవేళ తాను చెబితే.. వంద నిమిషాల్లో అక్కడకు వెళ్లి.. వారి ఫామ్ హౌస్‌లో సోదాలు చేస్తారా అని హీరో శివాజీ అన్నారు. ఒక్క కేసీఆరే కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్ రెడ్డి ఇంట్లోనే సోదాలు చేయాలన్నారు. ఈ పరిస్థితి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదు. 
 
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సోదాలు లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దీనితో సంబంధం లేదు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని శివాజీ చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఐటీ, జీఎస్టీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో డబ్బులు తీసుకెళ్తున్నా... సీజ్ చేస్తున్నారని హీరో శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఐటీ, జీఎస్టీ దాడులతో బెంబేలెత్తిస్తున్నారని శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడులు తమ పరిధిలో లేవని, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని ద్వివేదీ తనకు చెప్పారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments