Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం ఛాంపియన్ చెల్లిని తోసేశాడు... చనిపోయింది... గుంటూరులో...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (17:35 IST)
సెల్ ఫోన్లతో ఉపయోగాలు ఎన్ని వున్నాయో నష్టాలు కూడా అన్నే వున్నాయి. ఈ సెల్ ఫోన్ల మాయలో పడి చాలామంది టీనేజ్ పిల్లలు తాము ఏం చేస్తున్నామో పట్టించుకోవడంలేదు. మరికొందరైతే సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవికాకుండా సెల్ ఫోన్ల కోసం పిల్లల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు పోయాయి.
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని చినకొండాయపాలేనికి చెందిన 13 ఏళ్ల గోరంట్ల విజయలక్ష్మి ఏడో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో తల్లి, అన్నయ్యలతో కలిసి అమ్మమ్మగారి ఊరు ఉప్పలపాడుకు వచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య మంగళవారం నాడు స్మార్ట్ ఫోన్ వ్యవహారంలో తోపులాట జరిగింది. తనకు ఫోన్ చూపించాలంటూ విజయలక్ష్మి అన్నయ్యను అడిగింది. 
 
అందుకు అతడు ససేమిరా అనడమే కాకుండా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న చెల్లెల్ని బలంగా తోసేశాడు. అంతే... ఆమె తల నేలకి బలంగా తగిలింది. దీంతో ఆమె పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విజయలక్ష్మి క్రీడల్లో ఛాంపియన్‌గా పలు బహుమతులు అందుకుంది. కేవలం స్మార్ట్ ఫోన్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇంటిల్లపాది శోకంలో మునిగిపోయారు.‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments