Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషతో హ్యాపీగా ఉన్నా.. నా భార్య క్యారెక్టర్‌పై నిందలొద్దు.. రోజూ మీడియాలో?: సతీష్ చంద్ర

హైదరాబాద్ ఫిల్మ్ నగర్, ఆర్జే స్టూడియోలో పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసు మిస్టరీని తలపిస్తోంది. అయితే శిరీష భర్త మాత్రం తన భార్య క్యారెక్టర్‌పై లేనిపోని నిందలు వేయొద్దంటున్నారు. తన

Webdunia
శనివారం, 1 జులై 2017 (12:53 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్, ఆర్జే స్టూడియోలో పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసు మిస్టరీని తలపిస్తోంది. అయితే శిరీష భర్త మాత్రం తన భార్య క్యారెక్టర్‌పై లేనిపోని నిందలు వేయొద్దంటున్నారు. తన భార్య అయిన శిరీషతో తాను చాలా హ్యాపీగా ఉండేవాడినని భర్త సతీష్ చంద్ర అన్నారు. 
 
ఆర్జే స్టూడియోలో మాత్రమే శిరీష పనిచేయలేదని.. బెంగళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్‌లో కూడా శిరీష పార్ట్ టైమ్‌గా పనిచేసిందని సతీష్ చంద్ర చెప్పారు. దాదాపు ఏడాది నుంచి బెంగళూరు సంస్థలో ఆమె పనిచేస్తుందని.. నెలకు 30 నుంచి 40వేల వరకు డ్రా చేసేదని.. తాను నెలకు 15-20 వేల దాకా సంపాదించే వాడినని.. అయినప్పటికీ తమ మధ్య ఈగో సమస్యలు రాలేదని.. హ్యాపీగా ఉండేవాళ్లమని సతీష్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆర్జే స్టూడియోలో చేరి ఆరునెలలు అయ్యిందన్నారు.
 
ఈ కేసును ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని.. రోజూ మీడియాలో శిరీషను చూపించి.. ఆమె క్యారెక్టర్‌పై నిందలేస్తున్నారని సతీష్ చంద్ర వాపోయారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలూ లేవని అన్నారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పుకొచ్చారు. తాను ఎన్జీవో సంస్థ ఆశ్రే ఆకృతిలో పనిచేస్తుంటానని, చెవిటి, మూగ పిల్లలకు తాను వంట చేసి పెడతానన్నారు. శిరీషది ఆత్మహత్య కాదని.. ఆమెను హత్య చేశారని సతీష్ చంద్ర విమర్శించారు. ఈ కేసుపై స్పెషల్ ఎక్వైరీ జరిపించాలని సతీష్ చంద్ర డిమాండ్ చేశారు.

శిరీషను హత్య చేసిన తర్వాతే హైదరాబాదుకు తీసుకొచ్చారని, ఆమె ప్రమాదంలో ఉండటంతోనే రెండుసార్లు లొకేషన్ తనకు షేర్ చేసిందని సతీష్ చంద్ర అన్నారు. రాజీవ్, శ్రవణ్‌ల నుంచి నిజాన్ని ఎందుకు రాబట్టలేదని సతీష్ చంద్ర ప్రశ్నిస్తున్నారు. కుకునూర్‌పల్లి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని సతీష్ చంద్ర తెలిపారు. పోలీసులు కెమెరా విజువల్స్ ఉన్నాయని చెప్పినా వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదని సతీష్ చంద్ర ప్రశ్నించారు. క్యారెక్టర్ మీద ఫోకస్ ఆపేసి.. క్రైమ్ మీద ఫోకస్ పెట్టండంటూ సతీష్ చంద్ర అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments