Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిస్ట్ సెల్ ఫోన్‌ లాక్కుని సెల్ఫీ తీసుకున్న కోతి.. ఎక్కడో తెలుసా?

పర్యాటకుల పుణ్యమా అని జూలోని జంతువులు కూడా సెల్ఫీలకు అలవాటుపడినట్లున్నాయి. తాజాగా టూరిస్ట్‌ చేతిలోని సెల్ ఫోన్‌ లాక్కుని కోతి సెల్ఫీ దిగిన ఘటన ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌ హామ్‌‌లోని జూలో చోటుచేసుకుంది. జ

Cheeky monkey
Webdunia
శనివారం, 1 జులై 2017 (11:48 IST)
పర్యాటకుల పుణ్యమా అని జూలోని జంతువులు కూడా సెల్ఫీలకు అలవాటుపడినట్లున్నాయి. తాజాగా టూరిస్ట్‌ చేతిలోని సెల్ ఫోన్‌ లాక్కుని కోతి సెల్ఫీ దిగిన ఘటన ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌ హామ్‌‌లోని జూలో చోటుచేసుకుంది. జూకు వెళ్లే పర్యాటకులు వన్యమృగాలతో సెల్ఫీలు తీసుకుంటుంటారు. కొందరైతే మరీ ఓవరాక్షన్ చేస్తూ.. క్రూరమృగాల చెంతనుండేలా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 
 
ఇలా జూకొచ్చిన పర్యాటకులు సెల్ఫీలు తీసుకోవడం చూసి చూసి ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ జూలోని కోతి.. ఏకంగా సెల్ ఫోన్ లాక్కుని సెల్ఫీ తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెబెక్కా అనే యువతి బర్మింగ్ హామ్‌లోని వైల్డ్ లైఫ్ పార్క్‌కి వెళ్లింది. అక్కడ జంతువులను తన సెల్ ఫోన్ బంధిస్తూ రెబెక్కా బిజీగా ఉంది. 
 
ఇంతలో కాపుచిన్‌ జాతికి చెందిన కోతి ఒకటి వేగంగా వచ్చింది. రెబెక్కా చేతిలోని సెల్ ఫోన్ లాక్కుంది. ఈ సమయంలో రెబెక్కా ఆ కోతిని క్లోజప్‌లో ఫొటో తీసేందుకు ప్రయత్నించగా కోతి ఆమె సెల్‌ఫోన్ లాక్కుని.. సరిగ్గా కెమెరా బటన్‌పై నొక్కింది.
 
దీంతో ఆ కోతి కూడా సెల్ఫీ తీసేందుకు నేర్చుకుందని తెలిసి అందరూ అవాక్కయ్యారు. దానిని చూసిన సిబ్బంది ఆ కోతి పేరు రొమాని అని చెప్పడంతో ఈ ఫొటోని సోషల్ మీడియాలో రెబెక్కా పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోకు లైకులు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments