Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యను కాదని వేరే మహిళతో కుళికిన హెడ్ కానిస్టేబుల్.. భార్యకు అలా దొరికిపోయాడు..?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:33 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల పాప పుట్టింది. చివరికి ఓ హెడ్ కానిస్టేబుల్ భార్యను వదిలి వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో కట్టుకున్న భార్యను తిట్టడం.. ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం అతడు ఆమెను ఇంటి నుంచి బయటకు కూడా గెంటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. 
 
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల నుంచి అతడు మరో యువతి మోజులో పడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఎంతో బాధపడింది. ఎలాగైన తన భర్త ఆట కట్టించాలని మహిళా సంఘాలకు విషయాన్ని చెప్పింది.
 
ఓ రోజు పక్కా ప్లాన్ ప్రకారం మహిళా సంఘాల సహాయం తీసుకొని అతడు ఆ మహిళతో ఉన్న సమయంలో మెరుపు దాడి చేసింది. ఇంకేముంది చెప్పు తీసుకొని కానిస్టేబుల్ ను.. అతడితో పాటు ఉన్న ఆమెను కూడా చితకబాదింది. 
 
వివరాల్లోకి వెళితే.. గడ్డం రాజేశ్‌ పాల్వంచ (చాతకొండ) 6వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2011 సంవత్సరంలో అతడు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన స్వప్నను ప్రేమించి.. పెళ్లి కూడా చేసుకున్నాడు. వారికి ఆరేళ్ల పాప కూడా ఉంది. అయితే సాఫీగా సాగిపోతున్న కాపురంలో ఒక్కసారిగా విభేదాలు చోటుచేసుకున్నాయి. రాజేష్‌ ప్రతిరోజు స్వప్నను తిట్టడం, ఇష్టానుసారంగా కొట్టడం లాంటివి ప్రారంభించాడు. ఇలా రెండు సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.
 
ఇటీవల రాజేశ్‌ తన భార్యను ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న స్వప్న మహిళా సంఘాలను ఆశ్రయించింది. తర్వాత స్వప్న పక్కా ప్లాన్‌తో మహిళతో ఉన్న సమయంలో ఆమె మహిళా సంఘాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా రాజేష్‌ను పట్టుకుంది. అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. అతడితో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని చితకబాదింది.
 
రాజేష్‌కు మరికొంతమందితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేశాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రాజేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ పాల్వంచ పోలీసులను డిమాండ్ చేసింది. స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments