Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సొమ్ముతో జగనన్న సొంతింటి కలలు బొమ్మలు వేసుకుంటున్నారు: సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:27 IST)
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మ‌కంపై ప్లేట్ ఫిరాయించారు. ఉక్కు కర్మాగారం అమ్మ‌కం పాలసీ మేము పెట్టింది కాదు... అది నష్టాల్లో ఉంది. దానికి ఏడాదికి 1,300 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని చెప్పుకొచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నాయకులు ప్రైవేటీకరణను ఎప్పుడో స్వాగతించారు. అందుకే డైరీలు, స్పిన్నింగ్, చక్కెర మిల్లు అమ్మేశారు... అని ముక్తాయింపు ఇచ్చారు. 
 
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అన్యాయం జరుగదని, నిర్వాసితులను ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రితో కలిపించి, వారి కష్టాలను తెలిపామ‌ని సోము వీర్రాజు చెప్పారు. ఈ రాష్ట్రానికి 16 లక్షల ఇల్లు ఇచ్చాం... కేంద్రం నుంచి లక్షా ఏబై వేలు ఇస్తున్నాం. డబ్బులు మావి..పేరు వాళ్ళది. మోదీ సొమ్ముతో... జగనన్న సొంతింటి కల బొమ్మలు వేసుకుంటున్నార‌ని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో డబుల్ స్టికర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు త్రిబుల్ స్టికర్ వచ్చింది...అని వ్యాఖ్యానించారు.
 
సర్వ శిక్షా అభియాన్‌లో భాగంగా దేశంలో పాఠశాల లో మౌలిక సదుపాయాలకు నిధులు కేంద్రం చేస్తోంది. 60:40 పద్దతిలో స్కూల్ భవనాలు నిర్మించాలి. 5,000 కోట్లు కేంద్రం ఇచ్చింది, రాష్ట్ర వాటా ఇవ్వాలి.
 
8 నుంచి 10 వరకు విద్యార్థులకు కంప్యూటర్ ఉండాలి. విద్యార్థులకు యూనిఫామ్ మేము ఇస్తున్నాం. దానికి పేరు జగన్న యూనిఫామ్ అని పెట్టుకుంటున్నారు. ముఖ్య మంత్రి ఆరోగ్య కేంద్రాలకు నెలకు 4.5 లక్షలు రూపాయలు కేంద్రం ఇస్తోంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరోగ్య కేంద్రాన్ని రెండు ఆరోగ్య కేంద్రాలు గా మార్చి ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి పన్ను పెంచాల్సిన అవసరం లేదు.
 
అమృత పధకం కింద, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చాం... బీచ్లో జిమ్‌లు కేంద్ర నిధులతో నిర్మించారు. అందుకే ఆస్తి పన్ను వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంద‌ని బీజేపీ నేత వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments