Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడిపోయే సీటు కుమారుడికి ఇచ్చిన చంద్రబాబు..? గెలిచి సత్తా చాటుతానంటున్న లోకేష్.?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:55 IST)
నారా లోకేష్‌. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడిగా మంత్రి పదవిని ప్రస్తుతం అనుభవిస్తున్నారు. అయితే కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయించాలన్నది తండ్రి ఆలోచన. అంతేకాదు ఎలాగైనా గెలిపించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. ఈజీగా గెలిచే సీటు కాదు.. సవాల్‌గా తీసుకొని గెలిపించాలని కుమారుడికి సీటివ్వబోతున్నారు చంద్రబాబు.
 
ప్రస్తుతం లోకేష్‌ పోటీ చేస్తున్న ప్రాంతం మంగళగిరి. ఈ స్థానంలో ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యే ఆర్కే బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 12 ఓట్ల తేడాతో ఈయన గెలుపొందారు. బలమైన వర్గం బిసిలు ఉన్న ప్రాంతం ఇది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983, 1985 మినహా టిడిపి ఎమ్మెల్యే లేని నియోజకవర్గంగా మంగళగిరి ఉంది. 
 
పొత్తుల్లో భాగంగా ప్రతి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు, బిజెపికే కట్టబెడుతూ వచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పుడు లోకేష్‌ బాబును అదే స్థానం నుంచి రంగంలోకి దింపుతున్నారు. 66 వేల ఓట్లు ఉన్న బిసి వర్గానికి చెందిన ప్రజలే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును నిర్ధేశిస్తారు. టిడిపి బిసి పక్షపాతి కావడంతో ఖచ్చితంగా గెలుపు తనదేనన్న ధీమాలో టిడిపి నేతలు ఉన్నారు.
 
కానీ గెలుపు అంత సుళువు కాదని లోకేష్‌ చెబుతున్నారట. సవాల్‌గా తీసుకుని తన తండ్రి కేటాయించిన నియోజకవర్గంలో గెలిచి తీరుతానని లోకేష్‌ చెబుతున్నారట. మరి చూడాలి... లోకేష్‌‌ను మంగళగిరి ప్రజలు ఏమాత్రం ఆదరిస్తారో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments