Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైలు నుంచి పడిన ప్రేమికులు.. మాట్లాడుతూ..?

Train
Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:41 IST)
Train
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన కారుణ్య అనే 24 ఏళ్ల మహిళ కదులుతున్న రైలు నుంచి పడి తీవ్ర గాయాలపాలైన ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. 
 
చెంగల్‌పట్టులో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న కారుణ్య తన స్నేహితులతో కలిసి కేరళకు వెళ్తోంది. తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి ముందు కారుణ్య తన ప్రియుడు రాజేష్‌తో మాట్లాడుతూవుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. 
 
రైలు కదలడం ప్రారంభించగానే, ఇద్దరూ దానిని ఎక్కేందుకు పరుగెత్తారు, కానీ కారుణ్య కాలుజారిపోయింది. మెట్లపై నుంచి దొర్లిపోయింది. కదులుతున్న రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాజేష్ కూడా రైలు నుంచి కింద పడ్డాడు.
 
తోటి ప్రయాణీకులు వారిని కాపాడారు. రాజేష్‌, కారుణ్యను పట్టాల కిందకు వెళ్లకుండా కాపాడారు.  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments