Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బీహార్'​ తీర్మానం

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:47 IST)
ఎన్​ఆర్​సీ విషయంలో బీజేపీకి అనూహ్య పరిణామం ఎదురైంది. ఎన్​డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రం​లోనే జాతీయ పౌర పట్టికను వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసింది.

ఎన్​పీఆర్​ అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బీహార్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక-ఎన్​ఆర్​సీ అమలును వ్యతిరేకిస్తూ బీహార్​ శాసనసభ తీర్మానం చేసింది.

త్వరలో అమలు కావాల్సిన జాతీయ జనాభా పట్టిక-ఎన్​పీఆర్​ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్​పీఆర్​ను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన పద్ధతిలో కాక యూపీఏ హయాం(2010) నాటి విధానంలో స్వల్ప మార్పులతో రూపొందించాలని తీర్మానించింది.

బీజేపీకి ఎదురుదెబ్బ! దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై కొంతకాలంగా తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల శాసనసభలు ఇప్పటికే ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి.

అయితే... ఎన్​డీఏ(జేడీయూ-బీజేపీ) అధికారంలో ఉన్న బీహార్​లోనే ఇలాంటి తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్​లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్​ఆర్​సీ విషయంలో నితీశ్​ ప్రభుత్వం మిత్రపక్షం(బీజేపీ) వైఖరికి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఎన్​పీఆర్​ విషయంలోనూ స్వయంగా నితీశ్​ కుమార్​ అభ్యంతరాలు లేవనెత్తడం గమనార్హం.

కొత్త ఎన్​పీఆర్​ దరఖాస్తుల్లోని వివాదాస్పద నిబంధనల్ని తొలిగించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా చెప్పారు నితీశ్.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments