బీజేపీకి మిత్రపక్షం వైసీపీ: పీసీసీ

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (07:59 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వైసీపీ అతి విశ్వాసమైన మిత్రపక్షమని పీసీసీ చీఫ్‌ సాకే శైలజనాథ్‌ అన్నారు. వైసీపీ నేతలు  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై ఢిల్లీలో ఒకమాట, అమరావతిలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

విజయవాడలో ఆయన మీడియాతో  మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు’ ప్రతి ఒక్కరికీ ఒక వాడుకపదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోగడ చంద్రబాబు ఈవిధంగా ‘రాష్ట్ర ప్రయోజనా’లను ఉపయోగించుకుని ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.

శాసనమండలిని రద్దు చేయాలని ఢిల్లీ పెద్దలను కోరడం రాష్ట్ర ప్రయోజనమా అని సీఎం జగన్‌ను నిలదీశారు. ఒకపక్క బీజేపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్నా వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి గల కారణం ఏమిటని అడిగారు.

రాజధాని అమరావతిపై బీజేపీ నేతలు నచ్చినట్లుగా ప్రకటన చేస్తూ నాటకాలు ఆడుతున్నారని శైలజానాథ్‌ విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కాటికి వెళ్లిందనుకుంటే కళ్లముందు ప్రత్యక్షమైంది... ప్రకాశం జిల్లాలో ఘటన