Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన శిశువుల్ని కిడ్నాప్ చేసి.. అమ్మేస్తారు.. ముఠా అరెస్ట్

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:25 IST)
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శిశువులను కిడ్నాప్ చేసి.. అక్రమంగా విక్రయించిన నలుగురు మహిళలతో కూడిన ఏడుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను కిడ్నాప్ చేసే ఓ ముఠా.. దేశంలోని పలు ప్రాంతాల వారికి ఆ శిశువులను విక్రయిస్తూ.. బాగా డబ్బు గుంజుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసుల బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చిన్నారుల కిడ్నాప్ ముఠాకు చెందిన గంగాధర రెడ్డి అనే వ్యక్తితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఇటీవల ఒక నెల వయస్సుగల ఓ ఆడ శిశువు, రెండున్నర వయస్సున్న అబ్బాయిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. 
 
హైదరాబాదులో ఈ చిన్నారులను కిడ్నాప్ చేసి.. సంతానం లేని దంపతులకు రూ.2.5లక్షలు, రూ.3.10 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ముఠాకు చెందిన కిడ్నాపర్ల నుంచి ముగ్గురు చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అరెస్టయిన ఏడుగురి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం