తనిఖీల్లో భారీగా పట్టుబడిన డబ్బు - 7 బాక్సుల్లో 7 కోట్లు

సెల్వి
శనివారం, 11 మే 2024 (13:35 IST)
తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలుతున్న ఎన్నికల డబ్బు పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడుతోంది. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర ఓ లారీ వెళ్లి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం బోల్తాపడింది. 
 
విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వార్త తెలియగానే ఘటనా స్థలానికి కానిస్టేబుల్ ఎస్. రవికుమార్ చేరుకున్నాడు. 
 
వాహనంలో తౌడు బస్తాల మధ్య మొత్తం ఏడు బాక్సుల్లో నగదును దాచి తరలిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు.
 
హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన అధికారులు నగదును వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించి లెక్కించగా దాదాపు రూ. 7కోట్లుగా తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments