Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషంట్లకు నిస్వార్థ సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే చెవిరెడ్డి సమీక్ష

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (20:14 IST)
తిరుపతి: కరోనా వేళ నిస్వార్థంగా సేవలు అందించిన అధికారులు, సిబ్బంది పనితీరును ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశంసించారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు, నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా బారిన పడిన నా ప్రజలకు అండగా నిలిచి భరోసా కల్పించానని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫీవర్ సర్వే పట్ల దృష్టి సారించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి టెస్టులు చేయించాలని తెలిపారు.

పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు ఆత్మస్థైర్యం తో మెలగాలని, ధైర్యం చెప్పి భరోసా కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. దోమ కాటు కారణంగా మలేరియా వచ్చే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే పోలీస్ అధికారులను కోరారు. ప్రభుత్వ అనుమతులు పొంది రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆనందయ్య ప్రివెంటివ్ (పి) ఔషద మందును నియోజకవర్గ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

ప్రజల్లో ఈ ఔషదం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కోవిడ్ కేర్ సెంటర్ల అధికారులు మాట్లాడారు. చంద్రగిరి కోవిడ్ ఆసుపత్రి, కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా పేషంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే పద్మావతి నిలయం లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గాయని నోడల్ అధికారిని, తుడా సెక్రటరీ లక్ష్మీ పేర్కొన్నారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా అందిస్తున్న హోమ్ ఐసులేషన్ తదితర కిట్లు సకాలంలో అందిస్తున్నట్లు వివరించారు.  ఈ సమావేశంలో ఎంపిడిఓ లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments