Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం.. కరోనా బారిన పడిన వారిలో కూడా

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (14:44 IST)
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందనుకొనేలోపే బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో సైతం ఫంగస్ ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి 40 కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకమే అవుతుంది.
 
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారినపడి నిత్యం మరణిస్తున్నారు. దానికి తోడు తాజాగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 
 
ముఖ్యంగా కరోనా సోకి తగ్గిన వారిలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు... కరోనా సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో ఈ ఫంగస్ వెలుగుచూస్తోందని నిన్న మొన్నటి వరకు భావించారు. తాజాగా అసలు కరోనా సోకనివారిలో సయితం ఫంగస్ ఛాయలు కనిపిస్తుండడంతో మరో గుబులు మొదలైంది. 
 
ఏపీలో సోమవారం వరకు 1179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా అందులో 40 మంది కరోనా బారిన పడకుండా నేరుగా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 1068 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది బాధితులు మృతి చెందగా 97 మంది బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు .

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం