Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (09:16 IST)
వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజులు పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
 
 అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా  ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ఆర్ ఐ భాస్కర్, సిఐ వెంకట్ రవి ల నేతృత్వంలోని ఆర్ ఎస్ ఐ లు సురేష్, విశ్వనాథ్ ల టీమ్ లు రెండు రోజుల పాటు సదాశివ కోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం సాయంత్రానికి భారీ డంప్ ను కనుగొన్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు.
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... లాక్ డౌన్ లో ఎర్రచందనం దుంగలు సేకరించి పెట్టుకుని, లాక్ డౌన్ ముగియ గానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇంత పెద్ద డంప్ ఇటీవల కాలంలో లభించ లేదని అన్నారు.  డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  డంప్ స్వాధీనం చేసుకున్న సిబ్బందిని డిఐజి అభినందించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments