Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు 'వైఎస్ఆర్ కాపు నేస్తం' కింద రూ.490.86 కోట్ల పంపిణీ

Webdunia
గురువారం, 22 జులై 2021 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం ఒకటి. ఈ పథకాన్ని వరుసగా రెండో యేడాది కూడా అమలు చేయనుంది. ఇందులోభాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,27,244 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క క్లిక్‌తో రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేయనున్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ సొమ్ముల్ని పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద మహిళల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 
 
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, గురువారం 3,27,244 మంది పేద కాపులకు అందిస్తున్న రూ.490.86 కోట్లతో కలిసి మొత్తం రూ.981.88 కోట్ల లబ్ది చేకూరుతోందని ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments