నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ సర్కారుకు నిరాశ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కారుకు నిరాశ తప్పలేదు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది. 
 
మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అటు, ఎన్నికల నిర్వహణపైనా మాట్లాడదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. 
 
హైకోర్టు ఉత్తర్వుల కారణంగా గతంలోని అధికారులు కూడా పనిచేయలేకపోతున్నారని వివరించారు. మధ్యంతర ఎస్ఈసీని నియమించేలా గవర్నరుకు సూచించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 
 
అయితే ఏపీ ప్రభుత్వ న్యాయవాది సూచనలను న్యాయస్థానం తిరస్కరించింది. గవర్నరుకు ఈ దశలో సూచన చేయలేమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తేల్చి చెప్పారు. మరో మూడు వారాల తర్వాత తుది వాదనలు వింటామంటూ తదుపరి విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments