Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాంబాబు... మైనింగ్ రాయుడు : షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:01 IST)
ఏపీలోని అధికార వైకాపా అధికార పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే సంచలన ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ వారు ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. ఇది సంచలనంగా మారింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ రాజుపాలెం వైసీపీ కార్యకర్తలు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కోట నెమిలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిల్‌లో ఆరోపించారు. 
 
ఈ విషయంపై సీఎం జగన్‌, జిల్లా కలెక్టర్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే స్థానిక మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్‌లో వీరు పేర్కొన్నారు.
 
ఈ పిటిషన్‌ను వైకాపా కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది నాగరఘు దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు... అధికారిక పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తే... అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments