'సంపూ' కరోనా

Webdunia
శనివారం, 9 మే 2020 (20:57 IST)
సంపూర్ణేష్‌ బాబు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘హృదయ కాలేయం’తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగాడు. అనంతరం హాస్యమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రయోగం చేస్తూ సినీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఈ బర్నింగ్‌ స్టార్‌.

అయితే హృదయ కాలేయం తర్వాత ఆయన చేసిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కాస్త విరామం ప్రకటించి ‘కొబ్బరిమట్ట’తో థియేటర్లలో సందడిచేసి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ రోజు బర్నింగ్‌ స్టార్‌ సంపూ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 
 
చైనా దేశంలోని వూహాన్‌లో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. అయితే కరోనా అంశాన్నే కథాంశంగా తీసుకొని సంపూ తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర పోస్టర్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. వైరస్‌ పుట్టిన వూహాన్‌లోని గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా అంటూ పోస్టర్లపై ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపయింది. 
 
అయితే ఈ చిత్రానికి టైటిల్‌ ఫిక్స్‌ కానప్పటికీ ఈ పోస్టర్‌లో సంపూ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆయన చుట్టు కరోనా వైరస్‌ వ్యాపించినట్టు కనిపిస్తుంది. హృదయకాలేయంలో కంప్యూటర్‌ కనిపెట్టినట్టు ఈ చిత్రంలో కరోనా వైరస్‌తో సంపూ యుద్దం చేస్తాడేమో వేచి చూడాలి.

నోలాన్ మౌళి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments