ఉగాది రోజునా పస్తులేనా? ఉద్యోగులకు పడని వేతనాలు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (22:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఠంచనుగా నెలలో ఆఖరు తేదీన వేతనాలు జమ అయ్యేవి. కానీ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెలాఖరులో వేతనాలు జమ చేసిన సందర్భాలు చాలా చాలా అరుదు. ఈ నెల కూడా అదే విధంగా జరిగింది. 
 
శనివారం తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ. దీంతో ఈ నెలలో అయినా సకాలంలో జీవితాలు పడతాయని ఉద్యోగులంతా ఎదురు చూశారు. కానీ, ఏప్రిల్ ఒకటో తేదీ అయిన శుక్రవారం ఏ ఒక్క ఉద్యోగికి కూడా వేతనం జమకాలేదు. ఇందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం కాదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. 
 
కొత్తగా తలెత్తిన సమస్య కారణంగా ఈ నెల 6, 7వ తేదీల్లోగానీ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే... గత తెదేపా ప్రభుత్వ హయాంలో సీఎఫ్ఎంఎస్ పేరిట కొత్త తీసుకొచ్చిన విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తూ వ్చారు. అయితే ఇపుడు వైకాపా ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌‍ను మార్చేసి, తెదేపా ప్రభుత్వం కంటే ముందున్న హెచ్ఆర్ఎంఎస్ విధానం ద్వారానే వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం పేరోల్ పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్ను తీసుకొచ్చింది. ఈసాఫ్ట్‌వేర్ ఇంకా ఆర్బీఐతో అనుసంధానం కాలేదు. అంతేకాకుండా పాత విధానంలో బిల్లు అప్‌లోడ్ ఇంకా పూర్తికాలేదు. హెచ్ఆర్ఎంఎస్ విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా కొనసాగుతోంది. అది పూర్తయ్యేందుకు కనీసం ఈ నెల 5వ తేదీ వరకు సమయం పట్టేలా ఉంది. ఈ లెక్కల ఈ నెల 6 లేదా 7 తేదీల్లో ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments