Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించవు సరే.. కనీసం పెళ్లి కూడా చేసుకోవా? రోజాపై ప్రేమోన్మాది దాడి...

సాఫ్ట్‌వేర్ టెక్కీపై ఓ ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోనని చెప్పినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని సింగపూర్ టౌన్ షిప్ లో చేసుకుంది. ఈ వివరా

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (09:30 IST)
సాఫ్ట్‌వేర్ టెక్కీపై ఓ ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోనని చెప్పినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని సింగపూర్ టౌన్ షిప్ లో చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇన్ఫోసిస్‌ కంపెనీలో పిట్ట రోజా (23) అనే యువతి గత రెండున్నరేళ్లుగా టెక్కీగా పని చేస్తోంది. అదే సంస్థలో ఆమెతో పాటు చరణ్ చౌదరి అనే యువకుడు కూడా పని చేస్తున్నాడు. అతను కూడా ఆమె నివసించే సింగపూర్‌ టౌన్‌ షిప్‌‌లో ఆమె పక్క ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. 
 
వీరిద్దరి మధ్య మాటలు కలవడంతో రోజాను చరణ్ ప్రేమించసాగాడు. అలా గత ఆరు నెలలుగా ఆమెను ప్రేమించాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆమె ఒంటరిగా ఉండటం చూసిన చరణ్ చౌదరి తనను ప్రేమించాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించాడు. 
 
అయితే, ఆ యువతితో కలిసి జీవితం కొనసాగించాలని భావించిన చరణ్... పెళ్లి చేసుకుందామంటూ కొత్త ప్రపోజల్ ముందుకు తెచ్చాడు. దీనికి కూడా ఆమె నొ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆమెపై దాడికి దిగాడు. 
 
ఆమె తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయం కాగా, ఆమె గట్టిగా కేకలు వేయడంతో ప్రేమోన్మాది పారిపోయాడు. రక్తస్రావమైన టెక్కీని ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments