Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కి షాక్.. ఆ సినిమాకు మ్యూజిక్ చేయనంటున్న డైరెక్టర్లు..?

Webdunia
గురువారం, 30 మే 2019 (13:29 IST)
ప్రభాస్ నటిస్తున్న "సాహో" సినిమాకు పెద్ద దెబ్బ తగిలింది. సినిమా నుంచి తాము తప్పుకుంటున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు. 'సాహో' సినిమా నుంచి తాము తప్పుకుంటున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా ప్రకటించారు. 
 
ఆగష్టు 15వ తేదీన విడుదల కానుంది ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమా. కానీ 'సాహో' టీంకు షాక్ తగిలింది మ్యూజిక్ డైరెక్టర్ల రూపంలో. సాహో సినిమాకు శంకర్ ఎస్సాన్ లాయ్ సంగీత దర్శకులు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఎందుకు తప్పుకుంటున్నామన్న విషయాన్ని చెప్పలేదు కానీ మ్యూజిక్ ఇవ్వడం లేదని మాత్రం స్పష్టం చేశారు.
 
బాలీవుడ్‌లో డాన్ వంటి పెద్ద యాక్షన్ సినిమాలకు సంగీతమందించిన శంకర్ ఎస్సాన్ లాయ్‌ని ఏరికోరి మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు ప్రభాస్. ఇంటర్నేషనల్ లెవల్ మ్యూజిక్ కావాలని వీరిని తీసుకున్నారు. అయితే దర్శకుడు సుజిత్ ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లకి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయట. అయితే రిలీజ్‌కు సరిగ్గా రెండున్నర నెలల ముందు వీరు తప్పుకుంటున్నారు.
 
ఇప్పటికే నాలుగు పాటల చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. 'సాహో' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతోంది. అయితే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ మిగిలిన పాటలు గానీ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్స్. వారి ప్లేస్లో తమన్‌ తీసుకునే అవకాశం ఉందని టాక్. చివరి నిమిషంలో ఇప్పుడు మరింత కష్టపడాలి. 'సాహో' సినిమాను టైంకి రిలీజ్ చేయాలని. 
 
ప్రభాస్ హీరోగా.. శ్రద్ధకపూర్ హీరోయిన్‌గా 'సాహో' రూపొందుతోంది. దాదాపు 300కోట్ల రూపాయలతో తెలుగు, తమిళ, హిందీ, మళయాళ బాషల్లో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్. అబుదాబీ, దుబాయ్‌లలో కళ్ళు చెదిరే రేంజ్‌లో యాక్షన్ సీన్లు తీశారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments