తిరుమల శ్రీవారి రోజూ వారీ హుండీ ఆదాయమే కోట్లల్లో ఉంటుంది. ఇక స్వామివారి ఆస్తుల గురించి ప్రత్యేక చెప్పనక్కరలేదు. తాజాగా స్వామివారికి ఓ భక్తురాలు ఏకంగా రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను బహుకరించారు.
ఏపీ మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ ఈ స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను శుక్రవారం విరాళం ఇస్తామని తేజస్వీ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం తర్వాత రెండో అత్యంత ధనిక ఆలయంగా తిరుమలకు పేరున్న సంగతి తెలిసిందే.