Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఫౌండేష‌న్ స్కూళ్లకు రూ.1,863 కోట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ స‌హాయం

Webdunia
గురువారం, 15 జులై 2021 (16:00 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫౌండేష‌న్ స్కూళ్ల అభివృద్ధికి 250 మిలియ‌న్ డాల‌ర్లు అంటే రూ. 1,863 కోట్ల రూపాయ‌ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంక్ అందిస్తోంది. రాష్ట్రంలో విద్యా ప్ర‌మాణాలు పెంచ‌డంతోపాటు టీచ‌ర్ల‌లో స్కిల్స్ పెంచేందుకు ప్ర‌భుత్వం ఈ నిధులను వెచ్చించ‌నుంది.

మొత్తం 50 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టు ద్వారా ల‌బ్ధిపొంద‌నున్నారు. అంగ‌న్‌వాడీల్లో చ‌దివే 3 నుంచి 5 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న ప‌ది ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఇందులో ఉన్నారు. వీరుకాక‌, 45 వేల పాఠ‌శాల‌ల్లో చ‌దివే 6 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 40 ల‌క్ష‌ల విద్యార్థులు, 1.90 ల‌క్ష‌ల మంది టీచ‌ర్లు, 50 వేల మంది అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు ల‌బ్ధిపొందనున్నారు.

కోవిడ్‌తో బారిన ప‌డిన విద్యార్థుల ర‌క్ష‌ణ‌, చ‌దువుల్లో వెన‌క‌బ‌డిన విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, విద్యార్థునుల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడ‌తారు. పాఠాలు బోధించే టీచ‌ర్ల‌కు సైతం ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చి, వారిని నేటి విద్యా అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఏపీలో విద్యా వెలుగులు నింప‌డానికి ఈ వ‌ర‌ల్డ్ బ్యాంక్ స‌హాయం ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments