Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుళ్లను కూల్చేసి బాత్రూమ్‌లు కట్టేసిన బాబును శివసేన ఎందుకు వదిలేసింది?: రోజా

శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే రాజకీయాలపై మాట్లాడుతున్నానా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతోమంది తిరుమ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (11:00 IST)
శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే రాజకీయాలపై మాట్లాడుతున్నానా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతోమంది తిరుమల కొండలపై.. పవిత్ర పుణ్యేక్షత్రమైన శ్రీవారి సన్నిధిలో రాజకీయాలపై మాట్లాడారని గుర్తు చేశారు. శివ‌సేన వాళ్ల‌కి తాను చెప్పేది ఒక్క‌టేన‌ని, తాను హిందూ సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తాన‌ని రోజా వ్యాఖ్యానించారు. 
 
గుళ్ల‌ను కూల్చేసి ఆ స్థ‌లాల్లో బాత్‌రూంలు క‌ట్టిన చంద్ర‌బాబు నాయుడిని కూడా శివ‌సేన వారు నిల‌దీసి ఉంటే తాము సంతోషించేవారమ‌ని రోజా విమర్శించారు. దేవినేని ఉమా మహేశ్వరావు నాలుగు రోజుల ముందే శ్రీవారి సన్నిధికి వచ్చి రాజకీయాలపై మాట్లాడారని రోజా తెలిపారు. 
 
టీటీడీ బోర్డులో ఎంతోమంది దొంగ‌లు అడ్డంగా దొరికిపోయారని రోజా అన్నారు. అంతేగాకుండా టీటీడీ బోర్డులో లిక్కర్ మాఫియా వాళ్లు కూడా ఉన్నారని రోజా ఎత్తిచూపారు. తిరుమ‌ల కింద ఎన్నో బెల్టుషాపులు ఉన్నాయ‌ని ఆమె ఆరోపించారు. ఇంత‌మందిని ప్ర‌శ్నించ‌ని శివ‌సేన తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిందని.. వారికో న్యాయం.. తనకో న్యాయమా అంటూ రోజా ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments