Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో 14 మంది ప్రాణాలు తెల్లారిపోయాయి...

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (08:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు తెల్లారిపోయాయి. 
 
చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోగా, ఆ దిశగా వస్తున్న ఓ లారీ టెంపోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments