Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయిని నమ్మినట్టు కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మారు : రేవంత్ రెడ్డి

Webdunia
ఆదివారం, 29 మే 2016 (15:06 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కేసీఆర్‌ను ఆ రాష్ట్ర ప్రజలు కసాయిని నమ్మినట్టు నమ్మారని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న టీడీపీ మహానాడు చివరి రోజైన ఆదివారం ఆయన ప్రసంగిస్తూ... అబద్దాలతోనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు. 
 
ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఒక కసాయిని నమ్మినట్టు కేసీఆర్‌ను నమ్మారని వాపోయారు. రిజర్వేషన్ల శాతం పెంచేవరకు ఉద్యోగాల్లో గిరిజనులు, మైనార్టీలు, వికలాంగుల వాటా పక్కనపెట్టాలని ఆయన కోరారు. తెలంగాణ కోసం పోరాడిన 690 అమరుల కుటుంబాల అడ్రస్‌ దొరకడంలేదనడం దారుణమన్నారు. 
 
తెలంగాణలో రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చుచేశారు కాని అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. టీడీపీ వల్లే తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో మిషన్‌ 99 టార్గెట్‌గా పనిచేస్తామన్నారు. తెలంగాణాలో టీడీపీని ఏ శక్తీ ఏమీ చేయలేదన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments