Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు...

Webdunia
సోమవారం, 27 మే 2019 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోయాయి. రోహిణి కార్తె ప్రారంభంకావడంతో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులోనే 18 మంది పిట్టల్లా రాలిపోయారు. మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్ర ఇదేవిధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలుచోట్ల రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతుల రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ, వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆర్జీటీఎస్ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు పగటిపూట అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనిపక్షంలో గృహాలకే పరిమితం కావాలని కోరింది. 
 
మరోవైపు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపూరు జిల్లాల్లో ఎండలు అదరగొడతాయని ఆర్జీటీఎస్ హెచ్చరించింది. ఇదిలావుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments