Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఏపీ సర్కారు.. హెచ్చరించిన భారత రిజర్వు బ్యాంకు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (12:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. నిర్ధిష్ట రుణపరిమితులు దాటి రాష్ట్రం ఓవర్ డ్రాఫ్టులోనే ఉందని, ఇదే పరిస్థితి కొనసాగినపక్షంలో రాష్ట్రానికి బ్యాంకర్‌గా ఉన్న ఆర్బీఐ చెల్లింపులు నిలిపివేస్తుదని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్‌కు ఆర్బీఐ రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసింది. దీంతో దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక డ్రాఫ్టింగ్ సదుపాయం, చేబదుళ్ళ పరిమితి దాటిపోవడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్‌లోనే డిసెంబరు నెల గడిచిపోతోంది. ఇప్పటికైనా మేలుకోకపోతే ఓడీ పరిమితిని కూడా రాష్ట్రం దాటిపోతుందని ఆర్బీఐ హెచ్చరించింది. 
 
ఈ నెల 8వ తేదీ వరకు ఏపీ ఓవర్ డ్రాఫ్టులోనే ఉంది. అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్ట్‌ పరిస్థితులపై హెచ్చరిస్తూ ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్‌కు ఈ నెల 9వ తేదీన లేఖ రాయగా, ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments