Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆయన కువైట్‌లో ఉన్నాడు కదా.. ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. ఏం కోరికలు లేవా...?

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (11:12 IST)
నెల్లూరు జిల్లా రాపూరు పంచాయతీ కార్యదర్శి చెంచయ్య ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత మహిళ ఆరోపిస్తుంది. తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం కోసం చెంచయ్యను సంప్రదించగా, ఆయన తన కోర్కె తీర్చాలంటూ గత రెండేళ్లుగా ఫోన్లు చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాపూరు పోలీసులు చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ఇదే అంశంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం రాపూరు పంచాయితీ కార్యదర్శి చెంచయ్యను సంప్రదిస్తే.. ఆయన తన కోర్కెను తీర్చాలంటూ వేధిస్తున్నారని తెలిపారు. మీ ఆయన కువైట్లో ఉన్నాడు కదా ఒంటరిగా ఎలా ఉన్నావు అంటూ ఫోన్లు చేసి మనశ్సాంతి లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఈ వేధింపులు గత రెండేళ్లుగా భరిస్తున్నానని, ఇక భరించలేకే జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో రాపూరు పోలీసులు స్పందించి చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన చెంచయ్యను సస్పెండ్ చేయాలని, భవిష్యత్‌లో తనలాగా మరో మహిళకు జరగకూడాదని ఆమె కోరారు. తాను గిరిజన మహిళ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయలేకపోయానని, ఇపుడు వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments