Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్, ఎందుకు?

ఐవీఆర్
బుధవారం, 6 నవంబరు 2024 (11:07 IST)
తను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను పవన్ తరపున రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ చేసారు. కాగా తను పిఠాపురంలో విజయం సాధిస్తే... ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని ఎన్నికల సమయంలో పవన్ మాట ఇచ్చారు.
 
ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ పిఠాపురంలో భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించనున్నారు. ఇప్పటికే ఆయన భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలు కొనుగోలు చేసారు. ఈ భూమిలోనే ఇంటితో పాటు క్యాంప్ కార్యాలయం కూడా నిర్మించనున్నట్లు సమాచారం.
 
పంచ్ ప్రభాకర్ పైన పోలీసు కేసు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీప్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో పాటు ఏపీ హోం మంత్రి అనితలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైకాపా నేత పంచ్ ప్రభాకర్‌కు పోలీసులు తేరుకోలేని పంచ్ ఇచ్చారు. ఆయనపై ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా పంచ్ ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. 
 
ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అనే వ్యక్తి 'పంచ్ ప్రభాకర్' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. వైకాపా సానుభూతిపరుడిగా పేరొందిన ఈయన.. తన ఛానల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలను ఉపయోగించి, అసభ్య పదజాలంతో వారిని తిడుతూ వీడియోలు పెట్టాడు. మొగల్రాజపురానికి చెందిన డి.రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
 
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిని దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టిన వి.బాయిజయంతి అనే ఎక్స్ ఎకౌంట్ హోల్డర్‌పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్రాజపురానికి చెందిన సాదిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
 
అసభ్య పదజాలంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై 'ఎక్స్'లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాత పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు శౌరిశెట్టి రాధాకిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో M4M హిందీ ట్రైలర్ విడుదల

రామ్ పోతినేని 22వ సినిమాలో నాయికగా భాగ్యశ్రీ బోర్సే ఖరారు

మిస్టర్ ఇడియ‌ట్‌ లో మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌పై లిరికల్ సాంగ్ చిత్రీకరణ

సింగర్ సునీత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments