Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 మంది బాలికలపై అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి జైలు

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (19:56 IST)
అభంశుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధించాడు. పది సంవత్సరాల పాటు బెదిరించి కొంతమంది బాలికలపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. గర్భం దాలిస్తే తీయించాడు. ఇలా ఒకరిద్దరు కాదు ఎంతోమంది మైనర్ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన తిరుపతికి చెందిన ప్రభుత్వ బాలిక వసతి గృహం కామాంధుడికి శిక్ష పడింది. ఒక మైనర్ బాలిక ప్రాణాలకు తెగించి కామాంధుడి దురాగతాలను బయట పెట్టడంతో కటాకటాల్లో శిక్ష అనుభవిస్తున్నాడు కామాంధుడు. 
 
తిరుపతి సరోజినీదేవి రోడ్డులోని బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ నందగోపాల్ గత పదిసంవత్సరాలుగా మైనర్ బాలికపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఎవరూ లేని అనాథ పిల్లలను బెదిరించి లొంగదీసుకొని వారి జీవితంతో చెలగాటమాడుకుంటున్నాడు. కడప జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక తల్లి మరణించి, తండ్రి ఒక కేసులో జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో 2014 సంవత్సరంలో చేరింది.
 
అప్పటి నుంచి సూపరింటెండెంట్ గోపాల్ ఆ మైనర్ బాలికను లొంగదీసుకుని రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ బాలిక ఒక్కటే కాదు.. ఇంకా చాలామంది ఉన్నారు. సూపరింటెండెంట్ దురాగతాలను ఐదేళ్ళ పాటు ఓర్చుకుంటూ వచ్చిన బాలిక కడప వసతి గృహానికి వెళ్లింది. అక్కడకు వెళ్ళగానే కొంతమంది బాలికల సహాయంతో మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నందగోపాల్ పైన కేసు కూడా నమోదు చేశారు. ఈరోజు తెల్లవారుజామున నిందితునిపై పోక్సో యాక్ట్ కింద అరెస్టు చేసి తిరుపతి సబ్ బైలుకు తరలించారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ను విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం