Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో దెయ్యం వుందన్నాడు.. యువతిపై కన్నేశాడు.. బెదిరించి లోబరుచుకుని?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (11:43 IST)
ఆధునికత పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మూలన పడట్లేదు. తాజాగా హైదరాబాదులో దారుణం జరిగింది. మంత్రాల పేరిట ఓ యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది.


మంత్రాల పేరిట మోసగాళ్లు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందటే? ఇంట్లో దెయ్యం ఉందని... దాన్ని తన మంత్రాలతో తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
బోరబండకు చెందిన దంపతుల అనుమానాన్ని ఆసరాగా చేసుకుని యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తమ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం, పలు సమస్యలు వస్తుండటంతో కొన్ని వారాల క్రితం మల్లేపల్లికి చెందిన భూతవైద్యుడు ఆజంను కలిశారు ఆ దంపతులు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. 
 
దానిని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందన్నాడు. ఈ క్రమంలోనే దంపతుల కుమార్తెపై కన్నేసిన ఆజం... తనను పెళ్లి చేసుకోకుంటే నీ తల్లిదండ్రులు చనిపోతారని ఆమెను బెదిరించాడు. అలా లోబరుచుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న భూత వైద్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments