Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ యువతికి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం... ముగ్గురు యువకుల అమానుషం

ఓ అనాథ యువతిపై ముగ్గురు యువకులు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు కామాంధులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం గమనార్హం. పైగా, ఈ విషయం పంచాయతీ దృష్టికి వెళ్లడంతో న్యాయం చేయ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (08:58 IST)
ఓ అనాథ యువతిపై ముగ్గురు యువకులు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు కామాంధులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం గమనార్హం. పైగా, ఈ విషయం పంచాయతీ దృష్టికి వెళ్లడంతో న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులు బేరసారాలతో ఆమెను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లా కొత్తపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని (21) తల్లిదండ్రులు మూడేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి ఆమె నానమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. విద్యార్థిని నానమ్మ అనారోగ్యం పాలైతే అదే గ్రామానికి చెందిన పిట్టల నరేష్‌ అనే యువకుడు ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఈ చనువుతోనే నరేష్‌ సదరు విద్యార్థిని ఇంటికి వచ్చి వెళ్తూండేవాడు. 
 
ఈ నెల 4న పిట్టల నరేష్‌ తనకు రూ.500 కావాలని విద్యార్థినికి ఫోన్‌ చేశాడు. ఆమె డబ్బులు ఇచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూలేరని గమనించాడు. నరేష్‌ తన స్నేహితులైన పోలు ప్రేమకుమార్‌, బస్వ శ్రీకాంత్‌తోపాటు కలసి అదేరోజు రాత్రి ఒంటి గంట సమయంలో విద్యార్థిని ఇంటి వచ్చి తలుపు తట్టారు. విద్యార్థిని తలుపు తీసిన వెంటనే ఆమెపై దాడి చేశారు. కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కేశారు. ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. 
 
ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదరించారు. భయంతో ఆమె మొదట ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. మెల్లగా బయటపడటంతో పెద్దమనుషులు రంగంలోకి దిగి బేరసారాలు జరిపారు. సోమవారం సాయంత్రం విషయం పోలీసులకు తెలిసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments