Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా స‌భ ప్రారంభ‌మే కాలేదు... వైకాపాకు ద‌డ ద‌డ‌!

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (13:12 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గన్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ సిఎం ర‌మేష్ ప‌దునైన కామెంట్లు చేశారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ వేదిక‌ నుంచి ఆయ‌న వైకాపాకు స‌వాళ్ళు విసిరారు. 
 
 
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వానికి తాము కొంత సమయం ఇచ్చామని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వైకాపా చేసిందేమీ లేదని ఆరోపించారు. విజయవాడలో సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తామని చెప్పారు. సభ ప్రారంభమే కాలేదని.. అప్పుడే వైకాపాకు దడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. 

 
రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప, ప్ర‌భుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని కొందరు అధికారులే చెబుతున్నారన్నారు. రాష్ట్ర భాజపాపై తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు సీఎం రమేశ్‌ వద్ద ప్రస్తావించగా, తెదేపా ప్రతిపక్ష పాత్ర స‌రిగా పోషించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమేనని చెప్పారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం రమేశ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments