ముగియనున్న చిరంజీవి పదవీకాలం.. రాజకీయాలకు స్వస్తి?

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (10:59 IST)
మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు. వాస్తవానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఎలాగో మళ్లీ రాజ్యసభ పదవి ఛాన్స్ లేకపోవడంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి, పూర్తిగా సినిమాలపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు, చిరంజీవితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరికొందరు ఎంపీల పదవీ కాలం కూడా ఏప్రిల్ రెండో తేదీతో ముగియనుంది. వీరిలో తెలంగాణ రాజ్యసభ సభ్యులు దేవేందర్‌ గౌడ్‌, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి‌లతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు చిరంజీవి, రేణుకా చౌదరి, సీఎం రమేష్‌‌‌ల పదవీకాలం ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆ ఆరు స్థానాలతో పాటు 16 రాష్ట్రాల్లోని మొత్తం 58 రాజ్యసభ స్థానాల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ స్థానాలన్నింటికీ మార్చి 23న తెలంగాణ, ఏపీల్లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments