Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ఎన్నికలు : ఏపీలో ఏకగ్రీవమే ... తెలంగాణాలో?

ఈనెల 23వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. వీరిలో ఏపీ నుంచి టీడీపీ తరపున ఇద్దరు, వైకాపా నుంచి ఒకరు ఉన్నారు.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (19:15 IST)
ఈనెల 23వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. వీరిలో ఏపీ నుంచి టీడీపీ తరపున ఇద్దరు, వైకాపా నుంచి ఒకరు ఉన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస నుంచి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత శాసనసభ్యుల సంఖ్యా బలం ప్రకారం ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార తెదేపా, ఒకటి ప్రతిపక్ష వైసిపి కైవశం చేసుకునే అవకాశముంది. ఒక రాజ్యసభ సభ్యుడు గెలుపొందేందుకు 44 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. 
 
గత ఎన్నికల్లో వైసిపి నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 22మంది పార్టీ ఫిరాయించి, అధికార టిడిపిలో చేరారు. దీంతో వైసిపికి ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ఒక రాజ్యసభ స్థానం వైసిపి సొంతం కానుంది. మిగిలిన రెండు స్థానాలు అధికార టిడిపి వశం కానున్నాయి.
 
ఇందులో టీడీపీ తరపున సీఎం రమేష్, కె.రవీంద్ర కుమార్‌లకు టీడీపీ అవకాశం కల్పించగా, వైకాపా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments